Gam Gam Ganesha: శివరాత్రికి విశ్వక్ సేన్ కి పోటీగా దిగుతున్న దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gam Gam Ganesha coming to theatres on 08th March on the occasion of Shivaratri: విజయ్ దేవరకొండ సోదరుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ దేవరకొండ అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు బేబీ సినిమాతో హిట్ అందుకున్నాడు. సాయి రాజేష్ దర్శకత్వంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించి సూపర్ హిట్ కావడంతో ఆయన తదుపరి సినిమాల మీద కూడా ఆసక్తి ఏర్పడింది. అయితే బేబీ సినిమాతో పాటు ఆయన గం గం గణేశా అని ఒక సినిమా చేశాడు. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. వెన్నెల కిషోర్, కృష్ణ చైతన్య, జబర్దస్త్ ఇమ్మానుయేల్, బిగ్ బాస్ ఫేమ్ యావర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా చాలా కాలం క్రితమే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది.
Mahesh Babu: శ్రీమంతుడు కాపీ వ్యవహారంలో మహేష్ బాబుపై కేసు.. తెలివిగా తప్పించిన నమ్రత?
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను మార్చి 8వ తేదీన శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా వెంటనే మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతానికి శివరాత్రి సందర్భంగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గోపీచంద్ హీరోగా నటించిన భీమ సినిమాతో పాటు ఎర్ర చీర అనే ఒక హారర్ థ్రిల్లర్ కూడా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు అదే డేట్ లో ఆనంద్ దేవరకొండ గం గం గణేశా సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండటం గమనార్హం. ఒకరకంగా మిగతా సినిమాల విషయం పక్కన పెడితే విశ్వక్సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా మీద కాస్త బజ్ ఉంది. ఆ సినిమాకి పోటీగా ఈ గం గం గణేశా సినిమా దిగుతూ ఉండడం హాట్ టాపిక్ అవుతుంది. మరి చూడాలి శివరాత్రికి ఎవరు మంచి టాక్ తో వచ్చే హిట్ అందుకుంటారనేది.
తాజావార్తలు
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!