Mahesh Babu: శ్రీమంతుడు కాపీ వ్యవహారంలో మహేష్ బాబుపై కేసు.. తెలివిగా తప్పించిన నమ్రత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Writer Sarath Chandra Going to File cases against Mahesh babu and Mythri Naveen: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా కాపీ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే, తన నవల సీన్ టు సీన్ కాపీ కొట్టి శ్రీమంతుడు చేశారని నవలా రచయిత శరత్ చంద్ర సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే ఇప్పుడు ఆయన తాజా ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. తాను మహేష్ బాబు మీద అదేవిధంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ మీద సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయబోతున్నానని ఆయన వెల్లడించారు. గతంలో కూడా మహేష్ బాబుకి ఈ వ్యవహారంలో నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ కేసు నుంచి మహేష్ బాబుని తప్పించడానికి నమ్రత మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ లో మహేష్ పేరు తప్పించి గంగాధర్ అనే వ్యక్తి పేరు చేర్చారని శరత్ చంద్ర పేర్కొన్నారు. తనకు న్యాయంగా రావలసిన డబ్బు వచ్చేవరకు తన పోరాడుతానని అదేవిధంగా కొరటాల శివ తన తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్లాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Rashmika Mandanna: దేవరకొండతో పెళ్లి చేయాలనుకుంటున్నారు.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ఇది కచ్చితంగా శ్రమ దోపిడీ కిందకి వస్తుందని తన మేధో సంపత్తి వాడుకుని కోట్లు సంపాదించారు కాబట్టి అందులో తనకు న్యాయంగా రావలసిన వాటా వారు లెక్క కట్టి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక శ్రీమంతుడు కాపీ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు, ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తానని శరత్ చంద్ర పేర్కొనడం హాట్ టాపిక్ అవుతోంది. తాను స్వాతి వీక్లీలో ఈ నవలను వారం వారం పబ్లిష్ చేస్తూ వచ్చానని అంతా పూర్తయిన తర్వాత సినిమా చేయాలని దర్శకుడు సముద్ర దగ్గరికి కధలు తీసుకెళ్లి దానిమీద వర్క్ చేసామని అంతా సిద్ధమై షూటింగ్ కి వెళదాం అనుకుంటున్న సమయంలో ఈ సినిమా రిలీజ్ అయిందని సినిమా కంటెంట్ అంతా నాదే అని తెలుసుకొని కేసులు ఫైల్ చేశానని అన్నారు. సినీ పెద్దలు 10 -15 లక్షలు ఇస్తారు తీసుకోమని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నించారు కానీ వాళ్లు కాపీ కంటెంట్ అని ఒప్పుకునే వరకు తన పోరాటం ఆగదని శరత్ చంద్ర కామెంట్ చేశారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!