యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన ‘పాగల్’ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధమైపోయాడు. తాజాగా దానికి సంబంధించిన అధికారిక ఓ వీడియో ద్వారా ప్రకటన చేయడమే కాకుండా సినిమా టైటిల్ ను కూడా అప్పుడే రివీల్ చేశారు మేకర్స్. “గామీ” పేరుతో విశ్వక్ సేన్ చేస్తున్న కొత్త సినిమాను యువి క్రియేషన్స్ వారి కొత్త బ్యానర్ వి సెల్యులాయిడ్‌పై నిర్మిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.
Read also : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం గెస్ట్ గా అల్లు అర్జున్
విశ్వక్ సేన్ ఈ చిత్రంలో అఘోరా పాత్రలో నటిస్తున్నారు. కానీ అఘోరా గెటప్‌లో ఆయన లుక్ ను మాత్రం వీడియోలో చూపించలేదు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గామి’లో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. హారిక, మయాంక్ పరాఖ్, బొమ్మ శ్రీధర్, రమ్య పసుపులేటి, శాంతి రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిగిలిన వివరాలు త్వరలో వెలువడతాయి.