‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం గెస్ట్ గా అల్లు అర్జున్

అఖిల్ అక్కినేని, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కలిసి నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు సినీ ప్రియులు, అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబడుతోంది. కోవిడ్ -19 సెకండ్ వేవ్ తర్వాత “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తెలుగులో భారీ ఓపెనింగ్స్ రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. తాజా నివేదిక ప్రకారం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” టీమ్ రేపు సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను జరుపుకోబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను చిత్రబృందం ఆహ్వానించింది. రేపు హైదరాబాదులో జరగనున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారు.

Read Also : చిరంజీవి, మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడుకున్నారు

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించగా, గోపి సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ప్రదీష్ వర్మ కొరియోగ్రాఫర్, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటర్. మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

Related Articles

Latest Articles