FNCC Members Felicitated Telangana Speaker Gaddam prasad Kumar: తెలంగాణ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కి ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఫిలింనగర్ కల్చరల్ కమిటీ(FNCC) సభ్యులు, ప్రెసిడెంట్ ఆదిశేషగిరిరావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజు, ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. FNCC ప్రెసిడెంట్ , సెక్రటరీ సమక్షంలో పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి సన్మానం చేశారు. ప్రొడ్యూసర్ -FNCC సెక్రటరీ మోహన్ మాట్లాడుతూ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన స్పీకర్ కి ప్రత్యేకంగా నా తరపున, మా కమిటీ సభ్యులు తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
RGV : దావూద్ ఇబ్రహీం ఫోన్ తో వ్యూహం సినిమాకు సెన్సార్.. వర్మ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ నన్ను ఇలా ఈ సన్మానానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది, FNCC చాలా అభివృద్ధి చెందింది, ఇక్కడికి రావడం నా స్నేహితుల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలా FNCC ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా, FNCC కి నా వంతు కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ వుంటాయని తెలియచేశారు. ఇలా నన్ను ఆహ్వానించి సన్మానించినందుకు FNCC కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.