Flora Saini: మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కడున్నా తప్పడం లేదు. సాధారణ మహిళలే కాదు స్టార్ హీరోయిన్లు సైతం ఈ వేధింపులను ఎదుర్కొంటున్నారు. చాలామంది రిస్క్ చేసి బయటపడుతున్నారు.. ఇంకొంతమంది వారి చేతుల్లో బలవుతున్నారు. ఇక తాజాగా నటి ఫ్లోరా షైనీ.. ఆ నరకం నుంచి బయటికి వచ్చినట్లు చెప్పి షాకిచ్చింది. ఫ్లోరా షైనీ అంటే తెలుగువారికి తెలియకపోవచ్చు.. లక్స్ పాప ఆశా షైనీ అంటే టక్కున గుర్తుపడతారు. ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తోనూ మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఫ్లోరా ఒక నిర్మాత ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకొంది. అతడి కోసం ఇంట్లో వారిని కాదనుకొని పారిపోయి పెళ్లి చేసుకొంది. అయితే చాలామంది అమ్మాయిల జీవితాలలానే.. ఆమె జీవితం కూడా అంధకారంలో కూరుకుపోయింది. పెళ్ళైన కొద్దిరోజులకే అతడు నరకం చూపించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇష్టం వచ్చినట్లు కొట్టి.. నటన మానేయమని ఆంక్షలు పెట్టేవాడిని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.
TarakaRatna: తారకరత్న గుండె ఆగింది.. కానీ, బాలయ్యే ప్రాణం పోసాడు..?
“14 నెలలుగా నరకం చూసాను. అతడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించా.. కానీ కుదరలేదు.నన్ను అనరాని మాటలు అన్నాడు.. నటిస్తే చంపేస్తానని బెదిరించాడు. పచ్చి బూతులు తిడుతూ.. శరీరం మొత్తం రక్తం వచ్చేలా కొట్టాడు. నీచుడు.. కనీసం ప్రైవేట్ పార్ట్ లని కూడా చూడకుండా.. వాటిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశాడు. అతడు పెట్టే టార్చర్ ను భరించలేక చచ్చిపోదామనుకున్నా.. చివరికి అతడి నుంచి రిస్క్ చేసి తప్పించుకొని పారిపోయి వచ్చా.. ఆ దెబ్బలు నుంచి కోలుకోవడానికి నాకు చాలా నెలలు పట్టింది.. ఇప్పుడు ఇష్టమైన వారితో ఉంటున్నా.. నా కుటుంబమే ఇప్పుడు నాకు అన్ని” అని చెప్పుకొచ్చింది. దేవుడి దయవల్ల ఆ నరకం నుంచి బయటపడ్డావ్.. సంతోషంగా ఉండు అని కొందరు.. కొత్త జీవితం ప్రారంభించు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.