ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్, కృతి శెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. పవర్ ఫుల్ పోలీసాఫీర్ పాత్రలో రామ్ కనిపించనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ లో విడుదల కానుంది. ఇప్పటికే శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ని జరుపుకుంటుంది. లింగుస్వామి- రామ్ కాంబో అనగానే ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ బడ్జెట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యాస్టింగ్ ని కూడా అంతే భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ హీరోకు అంతే పవర్ ఫుల్ విలన్ కి కూడా వెతికి పట్టేశారు మేకర్స్.
అజ్ఞాత వాసి, సరైనోడు చిత్రాలలో స్టైలిష్ విలనిజాన్ని చూపించిన ఆది పిన్నిశెట్టి ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. వారియర్ ఎనిమీ ఫస్ట్ లుక్ ను రేపు మధ్యాహ్నం 2 గంటల 22 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాలోకి ఆదిని ఎంటర్ చేసి ఇంకా అంచనాలను పెంచేశారు మేకర్స్.. మరి ఈ కుర్ర హీరోల మధ్య వార్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.