జూనియర్ ఆర్టిస్టులని, యాంకర్లని బిగ్ బాస్ షోకి పంపిస్తామని చెప్పి డబ్బులు వసూల్ చేసుకునే గుట్టురట్టు అయ్యింది. తమ్మలి రాజు, సత్య అనే ఇద్దరు బిగ్ బాస్ కి పంపిస్తామని కొందరి నుంచి లక్షలు దండుకున్నారు. బిగ్ బాస్ సీజన్ -7 లో అవకాశం ఇప్పిస్తానని తమ్మిలి రాజు అనే అతను యాంకర్ స్వప్న చౌదరి నుంచి 2.5 లక్షలు తీసుకున్నాడు. సీజన్ స్టార్ట్ అయినా తన పేరు లేకపోవడంతో…స్వప్న, రాజును నిలదీడంతో సీజన్ -7 ఉల్టా పుల్టా కావడంతో… వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని రాజు నమ్మించాడు. సీజన్ అయిపోయే వరకు ఎదురుచూసిన స్వప్న చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రాజు పరారీలో ఉన్నాడు. మా టీవీ లో పనిచేస్తున్న సత్య, తమ్మలి రాజు… మోసాలకు పాల్పడుతున్నారు అని మా టీవీ సిబ్బందికి తెలియడంతో ఉద్యోగంలో నుంచి రాజుని తొలగించారు.
మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్, మరికొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లలో అవకాశం ఇప్పిస్తానని అనేక మంది నుంచి డబ్బులు దండుకుంటున్నారు రాజు, సత్య. రేలారే టీవీ షోకి యాంకర్‌గా వ్యవహరించింది స్వప్న. అలాగే “నమస్తే సేట్జీ” అనే మూవీలో కూడా నటించింది. బిగ్ బాస్ కి వెళ్ళాలన్న ఆమె ఆశను కొంతమంది కాష్ చేసుకున్నారని చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్వప్న చౌదరి… “నా డబ్బు డిసెంబర్ 20 లోగా ఇస్తానని చెప్పి ఆ తర్వాత జనవరి 6 న ఇస్తానని చెప్పాడు. ఇప్పడు ఫోన్ చేసి డబ్బు అడుగుతుంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ ఇస్తావా.. ఇచ్చుకో, ప్రెస్ మీట్ పెడతావా పెట్టుకో అని సమాధానం ఇస్తున్నాడు. బిగ్ బాస్ టీమ్ ఇది గమనించండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు” అని చెప్పుకొచ్చింది యాంకర్ కమ్ యాక్టర్ స్వప్న చౌదరి.