సమంతా ఫ్యాషన్ లుక్స్‌లో, యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియా ప్రెజెన్స్‌లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 100 సార్లు పడిపోయాను… ప్రతిసారీ లేచాను… అంటూ సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె గత 10 రోజులుగా రోజుకు దాదాపు 5-6 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన తన తాజా స్కీయింగ్ నైపుణ్యాల గురించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో హాలీడేలో ఉన్న సమంత తాను స్కీయింగ్ ఎలా నేర్చుకుందో తెలుపుతూ మరో పోస్ట్ పెట్టింది.
Read Also : విదేశాల్లో నాగ చైతన్య… నెక్స్ట్ ప్రాజెక్ట్ లో బిజీ బిజీ

“నేను బన్నీ వాల్ పై నా స్కీయింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాను. 100 సార్లు పడిపోయాను. ప్రతిసారీ లేచాను. నిష్క్రమించాలనే ఆలోచన చాలాసార్లు నా మనస్సులోకి వచ్చింది. కానీ నేను సంతోషంగా ఉన్నాను, ముందుకు సాగాను. బన్నీ స్లోప్ల నుండి రెడ్ రన్ పూర్తి చేయడానికి పట్టిన సమయం, దానికోసం చేసిన కృషిలో నేను నిజంగా ప్రత్యేకమైనదాన్ని కనుగొన్నాను. ఊహించని విధంగా ఇది ఉల్లాసంగా & ఉత్సాహంగా ఉంది” అంటూ సామ్ పోస్ట్ చేసింది. ఇందులో స్విట్జర్లాండ్‌లోని వెర్బియర్ స్కీ రిసార్ట్‌లో తనకు స్కీయింగ్ లో శిక్షణను ఇచ్చిన శిక్షకురాలు కేట్ మెక్‌బ్రైడ్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం సామ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇకం మరోవైపు సామ్ ముందుగా విడాకులు కోరిందని, నాగ చైతన్య తన కుటుంబం గురించి భయపడ్డాడని నాగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ ఆ వార్తలను కొట్టిపారేశారు.
