ఫరియా అబ్దుల్లా.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా అవతరించింది. యువతలోనూ విపరీతమైన ఫాలోయింగ్ గడించింది. కాకపోతే.. ఆ క్రేజ్‌కి తగినట్టు ఈమెకు మంచి అవకాశాలైతే రాలేదనే చెప్పుకోవాలి. ‘రావణాసురుడు’ మినహాయిస్తే.. గొప్ప ఆఫర్లేమీ లేవు. అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ భామకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రవితేజ సినిమాలోనే.. అదే ‘ధమాకా’. కాకపోతే హీరోయిన్‌గా కాదు.
ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. ధమాకాలో ఈ జాతిరత్నం భామ రవితేజ సోదరిగా కనిపించనుందట! సినిమాలో ఇదో కీలకమైన పాత్ర అని, ఈ రోల్‌కి ఫరియా కరెక్ట్‌గా సూట్ అవుతుందన్న ఉద్దేశంతో ఆమెనే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి త్రినాథ రావు నక్కిన దర్శకుడు. రవితేజ, త్రినాథ రావు కలయికలో వస్తోన్న తొలి సినిమా ఇది. పెళ్లి సందDతో ఫేమ్‌లోకి వచ్చిన శ్రీలీలా ఇందులో రవితేజ సరసన కథానాయికగా నటిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
కాగా.. రవితేజ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటైన ‘రామారావు ఆన్ డ్యూటీ’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. నిజానికి.. ఇది జూన్ 17వ తేదీనే రిలీజ్ కావాల్సింది. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతున్న తరుణంలో వాయిదా వేశారు. కానీ, ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమా ప్రోమోలు ఆసక్తికరంగా ఉండడంతో, దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.