ఫరియా అబ్దుల్లా ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగులో ‘జాతిరత్నాలు’ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ భామ జాతిరత్నాలు సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన హీరోయిన్ గా నటించింది.ఈ భామ ఆ సినిమాలో చిట్టీ పాత్రలో నవ్వులు పూయించింది. తన అందంతో నే కాకుండా తన కామెడీ టైమింగ్ తో కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమా తో ఈ అమ్మడు టాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. దీనితో ఫరియా అబ్దుల్లా కు వరస ఆఫర్స్ వస్తాయని అందరూ కూడా భావించారు.. కానీ ఈమె కెరీర్ ఆశించిన స్థాయిలో అయితే సాగడం లేదు.తాను అనుకున్న స్దాయిలో అవకాశాలు అందుకోలేక పోతుంది. తన హైట్ కారణంగా అవకాశాలు ఆశించిన స్థాయి లో రావడం లేదని తెలుస్తుంది.. దాంతో ఆమె వెబ్ సిరీస్ ల పై దృష్టి మళ్లించింది..
ఆమె నటించిన మొదటి వెబ్ సిరీస్ గా ‘ది జెంగబూరు కర్స్’ రూపొందింది. ఈ సీరిస్ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొనింది. ఆ క్రమంలో ఆమె మాట్లాడుతూ తాను ఓ స్టార్ హీరోకు ఫిమేల్ వెర్షన్ ని అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరూ అని అడగగా అతను మరెవరో కాదు రణవీర్ సింగ్ అని బదులిచ్చింది. తనకి తాను రణవీర్ సింగ్ కు ఫిమేల్ వెర్షన్ లా అనిపిస్తుందని ఆమె చెప్పింది. ఒక్కోసారి దీపిక పదుకోని కన్నా తానే ఎక్కువ రిలేట్ అవుతానని చెప్పుకొచ్చింది.ఇక ఆమె నటించిన ‘ది జెంగబూరు కర్స్’వెబ్ సిరీస్ ఈ నెల 9వ తేదీ నుంచి ‘సోనీ లివ్’లో స్ట్రీమింగ్ కాబోతుంది.. . ఈ వెబ్ సిరీస్ లో ఈ భామ ‘ప్రియ’ అనే పాత్రలో కనిపించనుంది. అలాగే నాజర్ – మకరంద్ దేశ్ పాండే ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.