బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటుల్లో కార్తీక్ ఆర్యన్ ఒకరు. తక్కువ టైమ్‌లో స్టార్డమ్ సాధించాడు ఈ యువ హీరో. ఈ హీరోకు ప్రస్తుతం లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాజాగా ఆయన అభిమాని ఒకరు చేసిన కామెంట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కార్తీక్ ఆర్యన్ తాజా ఇన్స్టాగ్రామ్ సెషన్ లో వచ్చిన అనేక వ్యాఖ్యల మధ్య ఒక మహిళా అభిమాని చేసిన కామెంట్ కార్తీక్ ఆర్యన్‌తో సహా అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Also : Samantha Pics : హద్దులు దాటేస్తున్న సామ్… గ్లామర్ ఓవర్ డోస్
ఆమెను పెళ్లి చేసుకోవడానికి సదరు అభిమాని కార్తీక్ ఆర్యన్‌కు రూ.20 కోట్లు ఆఫర్ చేయడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను లైక్ చేసిన తర్వాత, ఆమె “అచ్ఛా ముజ్సే షాదీ కర్లో 20 కోట్ల దుంగీ (నన్ను పెళ్లి చేసుకోండి… నేను మీకు 20 కోట్లు ఇస్తాను)” అని వ్యాఖ్యానించింది. కార్తీక్ ఆమె కామెంట్ కు స్పందిస్తూ నవ్వుతున్న ఎమోజితో త్వరగా స్పందించాడు. “కబ్ (ఎప్పుడు)?” అంటూ ఆమెను ప్రశ్నించాడు. ఈ యంగ్ హీరోను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ ఆర్యన్ సినిమాల విషయానికొస్తే… ఆయన చివరిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం ‘ధమాకా’లో కనిపించాడు.