మాస్ రాజా రవితేజ సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. వరుసగా సినిమాలు ప్రకటిస్తూ వాటి షూటింగ్ కూడా త్వరగా పూర్తి చేస్తూ దూసుకు పోతున్నాడు.అయితే ప్రస్తుతం రవితేజ ప్రకటించిన సినిమాల షూటింగ్స్ అన్నీ పూర్తి అయ్యాయి.. షూటింగ్ దశ లో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అందుకే మళ్ళీ సినిమాలను ఎంచుకునే ప్రయత్నం లో వున్నారు రవితేజ.రీసెంట్ గా ఒక కొత్త సినిమా ను అనౌన్స్ మెంట్ చేసారు.భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న సినిమా ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.తాజాగా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తో ఈ సినిమా పై హైప్ పెరిగింది. ఇప్పుడు ఈ సినిమా పై ఒక క్రేజీ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.. ఈ సినిమా లో ఆడియెన్స్ కోసం సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం .
ప్రేక్షకులకు ఇంట్రస్ట్ పోనివ్వకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.ప్రతీ 15 నిమిషాల కు కూడా థ్రిల్ చేసే అంశంతో ఆడియెన్స్ కు అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతుందని సమాచారం.ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుస్తుంది.ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి టార్గెట్ గా విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మాస్ రాజా పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు సినిమా తో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి.ఈ సినిమాలో రవితేజ దొంగగా కనిపించబోతున్నట్లు సమాచారం.