2024 సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తర్వాత అంతటి మార్కెట్ ఉన్న ఏకైక సినిమా ఈగల్ మాత్రమే. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది కానీ క్లాష్ లో సినిమాలు నష్టపోతాయి అనే ఉద్దేశంతో రవితేజ ఈగల్ సినిమాని వాయిదా వేసాడు. ప్రొడ్యూసర్స్ రవితేజని కలిసి ఈగల్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 13 నుంచి జనవరి 26కి ఈగల్ సినిమా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు కానీ ఊహించని షాక్ ఇస్తూ జనవరి 13 నుంచి ఈగల్ సినిమా ఫిబ్రవరి 9కి వాయిదా పడింది. ఇతర సినిమాల కోసం బజ్ ఉన్న తన సినిమాని వాయిదా వేసుకోవడంతో రవితేజ గొప్పదనం తెలుస్తుంది కానీ రవితేజ ఫ్యాన్స్ ని మాత్రం కొత్త రిలీజ్ డేట్ భయపడుతుంది.
జనవరి 26న రవితేజ పుట్టిన రోజు, ఈ రోజున రిలీజైన ఏ రవితేజ సినిమా హిట్ అవ్వలేదు అందుకే సెంటిమెంట్ గా భావించి ఈగల్ సినిమాని ఫిబ్రవరికి పుష్ చేసారు. అయితే ఫిబ్రవరి నెల కూడా రవితేజకి అసలు కలిసి రాదు. ఇప్పటివరకూ ఫిబ్రవరి నెలలో రిలీజైన ఏ రవితేజ సినిమా హిట్ అయిన హిస్టరీనే లేదు. గతంలో ఇదే ఫిబ్రవరి 9న షాక్ సినిమా, ఫిబ్రవరి 2న నిప్పు, అదే ఫిబ్రవరి 2న టచ్ చేసి చూడు, ఫిబ్రవరి 11న ఖిలాడీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒక్కటి కూడా రవితేజకి హిట్ ఇవ్వలేకపోయాయి. ఇంత నెగటివ్ సెంటిమెంట్ ఉన్న ఫిబ్రవరిలో ఈగల్ సినిమాని రిలీజ్ చేస్తుండడంతో రవితేజ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే సినిమా బాగుంటే ఏ సెంటిమెంట్ పని చేయదు కాబట్టి ఈగల్ మంచి సినిమా అయితే ఈ నెగటివ్ సెంటిమెంట్ కి ఎండ్ కార్డ్ వేసి కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తుంది.