Dulquer Salman: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. సీతారామం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం దుల్కర్ నటిస్తున్న భారీ చిత్రం చుప్. ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్ అనేది ట్యాగ్ లైన్. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆర్. బాల్కి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ఎంతో ఆసక్తిని కలుగజేస్తున్నాయి. ఈ చిత్రంలో దుల్కర్ తో పాటు బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, పూజా భట్, తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 5 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ కథ మొత్తం సినిమాల చుట్టూనే తిరుగుతుందట.
సినిమా చూడకుండా, సినిమా వాళ్ళ కష్టాలను అర్ధం చేసుకోకుండా రివ్యూలు రాసేవారిని దుల్కర్ మర్డర్ చేస్తూ ఉంటాడట. అతడిని పట్టుకోవడానికి సన్నీ డియోల్, పూజా భట్ ప్రయత్నిస్తూ ఉంటారట. ఇక ఈ సినిమాలో దుల్కర్ సైకోగా మారి హత్యలు ఎందుకు చేస్తాడు..? సినిమాలకు, అతడికి ఉన్న సంబంధం ఏంటి అనేది కథగా బాల్కి చూపించనున్నాడని టాక్. ఏదిఏమైనా విభిన్నమైన పాత్రలను ఎంచుకొని విజయాలను అందుకోవడం ఈ మలయాళ హీరోకు మొదటి నుంచి ఉన్న అలవాటు. తెలుగులో సీతారామం చిత్రాల్లో ప్రేమికుడిగా కనిపించిన దుల్కర్ వెంటనే ఈ సినిమాలో సైకో గా కనిపించనున్నాడు. మరి ఈ సినిమా ఏ హీరోకు ఎలాంటి విజయాన్ని అందివ్వనున్నదో చూడాలి.