ఎస్తేర్ అనిల్ అని అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. అదే ‘దృశ్యం’ లో వెంకటేష్ చిన్న కూతురు అని చెప్పండి.. టక్కున ఓ ఆ పాప అనేస్తారు.. దృశ్యం మొదటి పార్ట్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రెండో పార్ట్ దృశ్యం 2 లో అమ్మడు కొంచెం పెద్దదానిలా కనిపించి కనువిందు చేసింది. అప్పుడే ఆ పాప హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది. బాలనటిగా కోలీవుడ్ లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోలో హీరోయిన్ గా నటించడానికి ప్రయత్నాలు చేస్తోందట. దానికోసమే హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఇక ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ‘దృశ్యం 2’ సక్సెస్ మీట్ లో ఎస్తేర్ వేసుకున్న డ్రెస్ పైనే అందరి కళ్లు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. బ్లాక్ కలర్ స్లీవ్ టాప్.. బ్లాక్ ట్రాన్సఫరెంట్ జీన్స్ వేసి హెయిర్ ని చక్కగా ముడివేసి.. లేలేత పరువాలను ఆరబోసింది. ఇక ఏ పాపను చూసినవారందరు.. అరెరే ఈ బుడ్డది అప్పుడే హీరోయిన్ గా మారిపోయింది అంటూ నోళ్లు నొక్కుకుంటున్నారు. ప్రస్తుతం ఈ హాట్ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఎస్తేర్ ఆశలు ఫలించి త్వరలోనే హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంటుందో లేదో చూడాలి.
https://www.instagram.com/p/CWpoIkGpOHZ/