Famous actress Jayaprada met President Draupadi Murmu
రాష్ట్రపతిగా మన దేశపు అత్యున్నత పీఠం అధిష్టించిన ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు మాజీ రాజ్యసభ సభ్యురాలు, ప్రముఖ నటి జయప్రద. కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి భవన్ లో ప్రథమ మహిళను కలిసిన జయప్రద… ఆమె పదవీకాలం జయప్రదం కావాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం బీజేపీలో జయప్రద క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు.