Double iSmart: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. 2019లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ సరసన కావ్య థాపర్ నటిస్తుండగా.. సంజయ్ దత్, అలీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ సినిమా పైన మంచి హైప్ క్రీయేట్ చేసాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ పైన అప్డేట్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఆగస్ట్ 4న వైజాగ్‌లో మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి అంటు ప్రకటించారు. ఆగస్ట్ 4న ట్రైలర్ వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరగనుంది.
Also Read: Devara: ‘దేవర’లోకి నాగవంశీ.. భలే ఎంట్రీ ఇచ్చాడే!
ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా, మూవీకి మరింత బజ్‌ని క్రియేట్ చేస్తోందని ప్రామిస్ చేయనుంది. డబుల్ ఇస్మార్ట్‌ను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, కావ్యా థాపర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా, డీవోపీగా సామ్ కె నాయుడు, జియాని జియానెలీ పని చేస్తున్నారు.డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ మూవీతో రామ్, పూరి ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చుడాలిసిందే..