గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్ప త్రిలోని ఆపరేషన్ థియేటర్ కాసేపు సినిమా థియేటర్గా మారింది. రోగికి ఇష్టమైన ‘పోకిరిసినిమా చూపిస్తూ వైద్యులు అతనికి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీని విజయవంతంగా చేశారు. ఏపీ ప్రభుత్వ వైద్యరం గంలో తొలిసారిగా రోగి మెలకువలో ఉండగానే మెదడు ఆపరేషన్ చేసినట్లు గుంటూరు జీజీహెచ్ వైద్య వర్గాలు ప్రకటించాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఐలాపురానికి చెందిన పండు (48) కాలు, చేయి బల హీనపడి అపస్మారక స్థితికి చేరడంతో జనవరి 2న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి ఆస్పత్రికి తీసుకొచ్చారు.
Read Also: SSMB 29: ట్రిప్ కంప్లీట్ అయ్యింది… బాబు ల్యాండ్ అయ్యాడు
తీసుకి అతని మెదడులోని మోటార్ కార్టెక్స్ అనే భాగంలో కణితి ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. దానిని తొల గించే క్రమంలో రోగి కుడి కాలుచేయి చచ్చుబడే ప్రమాదం ఉంది. ఆపరేషన్ సమయంలో రోగిని మెలకువగా ఉంచి, అతడి కాళ్లు, చేతుల కదలికలను గమనించడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించాలని న్యూరో వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో జనవరి 25న రోగికి లోకల్ అనస్థీషియా ఇచ్చి ఎవేకెన్ బ్రెయిన్ సర్జరీ చేశారు. పండు హీరో మహేశ్ బాబు అభిమాని కావడంతో, ల్యాప్ట్యాప్లో ‘పోకిరి’ సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ ముగించారు.
Read Also: Prabhas: సెట్స్ అలానే ఉన్నాయి… షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్