Back story of Vijay Deverakonda vs Abhishek Nama: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అయి ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. మూడు రోజుల్లోనే 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నాలుగో రోజు వసూళ్లు మాత్రం ఇంకా బయట పెట్టలేదు. ఆ సంగతి అలా ఉంచితే విశాఖపట్నంలో జరిగిన ఖుషి సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ తన మీద జరుగుతున్న ఎటాక్ గురించి ప్రస్తావిస్తూనే ఈ సినిమాని ఇంతగా హిట్ చేసినందుకు గాను తాను అభిమానులకు ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పి అప్పటికప్పుడు కోటి రూపాయలు తన రెమ్యునరేషన్ లో నుంచి 100 కుటుంబాలకు లక్ష చొప్పున పంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు.
Narayana & Co: సైలెంటుగా అమెజాన్ ప్రైమ్ లోకి “నారాయణ అండ్ కో”
ఒక హీరో ఇలా తన సక్సెస్ ని పంచుకోవడం మొదటిసారి అని అందరూ సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటే, ఇప్పుడు నిర్మాత గతంలో డిస్ట్రిబ్యూటర్ గా పలు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ నామాకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి విజయ్ దేవరకొండ కి కౌంటర్ వేసినట్లుగా ఒక ట్వీట్ చేశారు. ట్విట్టర్లో మీరు అభిమానులకు డబ్బులు ఇవ్వాలనుకోవడం సంతోషమే అలాగే మీ వరల్డ్ ఫేమస్ లవర్ పంపిణీ చేసినందుకు మేము ఎనిమిది కోట్లు పోగొట్టుకున్నాం, మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలను కూడా ఆదుకోండి అంటూ సెటైరికల్ గా ఒక ట్వీట్ చేశారు. ఇది కావాలని విజయ్ మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేసిన ట్వీట్ గా విజయ్ అభిమానులు అభివర్ణిస్తున్నా అసలు వీరిద్దరి మధ్య జరిగిన వివాదం ఏమిటి? ఎందుకు ఇలా ట్వీట్ చేయాల్సి వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా అభిషేక్ నామ పూర్తి వెర్షన్ ఒక వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అసలు విషయం ఏమిటంటే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాని కేఎస్ రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద నిర్మించగా నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ బేసిస్ మీద డిస్ట్రిబ్యూట్ చేసి ఎనిమిది కోట్ల వరకు అభిషేక్ నామ లాస్ అయ్యారట. ఈ సినిమా లాస్ అయిన తర్వాత ఈ సినిమా నష్టాన్ని తీర్చమని అడగను, మీ రెమ్యూనరేషన్ ఎంత ఉంటే అంతే తీసుకుని మా బ్యానర్ కి మాత్రం ఒక సినిమా చేసి పెట్టండి, ఒక మంచి కథతో సినిమా చేసి ఆ నష్టాన్ని భర్తీ చేసుకుందాం అని అభిషేక్ నామా విజయ్ కి ప్రపోజల్ పెట్టారట. అయితే విజయ్ దేవరకొండ టీం మాత్రం ఇప్పుడు తెలుగు సినిమా నిర్మాతలకు సినిమాలు చేయట్లేదు కాబట్టి ఇప్పట్లో సినిమా చేయడం కష్టం అని క్లారిటీ ఇచ్చారట. అయితే ఇదంతా జరిగింది లైగర్ షూటింగ్ సమయంలో. ఆ తర్వాత గతంలో విజయ్ దేవరకొండ ఒప్పుకున్న మైత్రి మూవీ మేకర్స్ కి ఈ ఖుషి సినిమా చేయడం రిలీజ్ అవ్వడం ఈ కథంతా తెలిసిందే. తమకు సినిమా చేయమని అడిగితే చేయకపోవడంతో నామ అభిషేక్ ఇంతలా హర్ట్ అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఒకరకంగా నేను అడిగిన దాంట్లో తప్పేం ఉంది, జరిగిన నష్టం కనిపిస్తూనే ఉంది కదా అని అభిషేక్ నామా సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.