SarathBabu: సీనియర్ నటుడు శరత్ బాబు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన చనిపోయే చివరి రోజువరకు సినిమాలు చేస్తూనే ఉన్నారు. శరత్ బాబు చివరిగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. దివంగత నటుడు కృష్ణ పాత్రలో ఆయన కనిపించారు. శరత్ బాబు ను మళ్లీ పెళ్లి ట్రైలర్ లో చూడొచ్చు. ఇక ఆయన చివరి చిత్రం మే 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న చిత్రబృందం.. శరత్ బాబు మృతి వార్త విని షాక్ అయ్యినట్లు చెప్పుకొచ్చారు. ఆయనతో వారు పంచుకున్న జ్ఞాపకాలను ఏకరువు పెట్టారు. ఒక ప్రెస్ నోట్ ద్వారా ఆయన మృతికి సంతాపం తెలిపారు. “సుమారు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సీనియర్ నటులు శరత్ బాబు గారు శివైక్యం చెందడం మాకు మాత్రమే కాదు, కళారంగానికి కూడా ఒక తీరని లోటు. చివరిసారిగా ఆయన నటునిగా “మళ్ళీ పెళ్ళి” సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించారు.
శరత్ బాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్ధిస్తూ, ఈ పరిస్థితుల్లో వారి కుటుంబసభ్యులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భావోద్వేగభరితమైన హృదయాలతో వారికి మా ఘననివాళి” అంటూ చెప్పుకొచ్చారు.
Sarath Babu: శరత్ బాబు మృతి.. సీఎం జగన్, చంద్రబాబు సంతాపం
ఇక డా.నరేష్ వి.కె మాట్లాడుతూ.. “శరత్ బాబు గొప్ప విలక్షణ నటుడే కాదు నాకు చాలా ఏళ్ళుగా మంచి మిత్రుడు. పెద్దన్నయ్య లాంటి వాడు. కోకిల లాంటి ఎన్నో మంచి సినిమాలు చేశాం. సాగర సంగమంలో ఆయన చేసిన పాత్ర కొన్ని తరాలు మర్చిపోదు. మా కాంబినేషన్ లో ఆయన చేసిన ఆఖరి సినిమా మళ్ళీ పెళ్లి. సినిమా విడుదల కాకముందే ఆయన వెళ్ళిపోయారు. ఆయన మరణం నిజంగా గుండెల్ని పిండేస్తుంది. ఆనందంగా వుండండి అని చెప్పి వెళ్లారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అని ప్రార్థించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
#RIPSarathBabu garu 💔 pic.twitter.com/FPiX9Y9QQ6
— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) May 22, 2023