Suriya 42: కోలీవుడ్ సార్ హీరో సూర్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే సూర్య నటించిన వాడివసుల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచలుడు షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ రెండు కాకుండా మరో సినిమాను ప్రకటించి షాక్ ఇచ్చాడు సూర్య. కోలీవుడ్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య 42 సినిమా తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మేకర్స్ నేడు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా పది భాషల్లో రిలీజ్ కానున్నట్లు పేర్కొన్నారు. సూర్య ముఖాన్ని చూపించకపోయిన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో సూర్య నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ 2 బ్యానర్స్ సంయుక్తంగానిర్మిస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ నటిస్తుందని తెలుస్తోంది. తాజాగా ఆమె ఈ మూవీ మోషన్ పోస్టర్ ను షేర్ చేస్తూ చిత్ర యూనిట్ కు కంగ్రాట్స్ చెప్పింది. దీంతో అభిమానులు దిశా ఈ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెడుతుందని చెప్పుకొస్తున్నారు. వెల్ కమ్ టూ కోలీవుడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే దిశాకు మంచి ఎంట్రీ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా హీరో.. శివ కూడా స్టార్ డైరెక్టర్. ఈ కాంబోలో వస్తున్న సినీరంతో దిశా పరిచయమైతే ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి మేకర్స్ అధికారికంగా దిశను ఎప్పుడు హీరోయిన్ గా ప్రకటిస్తారో చూడాలి.
#Suriya42 https://t.co/k7fuzq1Bg4@Suriya_offl @directorsiva @ThisIsDSP @iYogiBabu @vetrivisuals@kegvraja @StudioGreen2 @UV_Creations
— Disha Patani (@DishPatani) September 9, 2022