OG : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ భారీ హిట్ అయింది. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించింది ఈ సినిమా. అయితే దీనికి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని పవన్ క ల్యాణ్, సుజీత్ ప్రకటించారు. కానీ ఎప్పుడు ఉంటాయనేది ఇంకా చెప్పలేదు. అప్పుడే వాటిపై రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఓజీ-2లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. దానిపై ఆ మధ్య సుజీత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అది పవన్ కల్యాణ్ ఇష్టం అన్నాడు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సుజీత్, తమన్ కలిసి డాలస్ కు వెళ్లి అక్కడ థియేటర్ లో అభిమానులతో కలిసి మూవీ చూశారు.
Read Also : Ari Trailer : ఇంకా కావాలనిపిస్తుంది.. అనసూయ కొత్త సినిమా ట్రైలర్ చూశారా
ఈ సందర్భంగా ప్రేక్షకులు ఓజీ2లో అకీరా నటిస్తారా అని అడిగిన ప్రశ్నకు సుజీత్ ఆన్సర్ ఇచ్చాడు. ఆ విషయం ఇప్పుడే చెబితే థ్రిల్ పోతుంది అని సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆయన మాటలను బట్టి అకీరా నటిస్తాడని క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ నటించకపోతే లేదు అని కొట్టిపారేసేవాడు. ఎందుకంటే ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసి తర్వాత చేయకపోతే బాగుండదు కదా. ఆ విషయం సుజీత్ కు తెలుసు. అకీరా నటిస్తాడనే క్లారిటీ ఉండటం వల్లే ఈ విధంగా క్లారిటీ ఇచ్చాడన్నమాట. దీంతో సుజీత్ కామెంట్లతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అకీరా సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Read Also : Dammu Srija : నా కూతురు గంజి తాగి బతికింది.. శ్రీజ తండ్రి కామెంట్స్