Ari Trailer : అనసూయ మెయిన్ రోల్ చేస్తూ వస్తున్న మూవీ అరి. ఇందులో సాయికుమార్ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నాడు. మనిషిలోని ఎమోషన్స్, కోరికలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీసినట్టు తెలుస్తోంది. జయశంకర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మనుషులకు ఉన్న కోరికలను తీర్చబడును అనే కాన్సెప్టుతో తీసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్పాలని అంటున్నారు. ఒక్కొక్కరికి ఉన్న కోరికలను బయట పెడుతుంటారు.
Read Also : Hema : ఎవరినైనా చంపేయాలి అనిపించేది : హేమ
అనసూయ కూడా తనకు ఉన్న కోరికను బయట పెట్టింది. అందం విషయంలో నాకు అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఆడపిల్లను కదా.. ఇంకా కావాలనిపిస్తుంది అంటూ ఆమె చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. తనకంటే అందంగా ఉన్న ఓ అమ్మాయి మీద యాసిడ్ పోసినట్టు ట్రైలర్ లో చూపించారు. మరి మనుషుల కోరికలను తీర్చేందుకు ఆ వ్యక్తి ఏం చేశారు అనేది మనకు సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది కాబోలు. ప్రస్తుతం ట్రైలర్ అయితే బాగానే వైరల్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్టుతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి సినిమా ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే.
Read Also : Dammu Srija : నా కూతురు గంజి తాగి బతికింది.. శ్రీజ తండ్రి కామెంట్స్