పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘ఖుషీ’ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఈ సంధర్భంగా ‘ఖుషీ’ మూవీని ప్రొడ్యూస్ చేసిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్, ఈ మూవీని వరల్డ్ వైడ్ రీరిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. డిసెంబర్ 31న ‘ఖుషీ’ మూవీ రీరిలీజ్ అవుతోంది, ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూడడానికి పవర్ స్టార్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ‘ఖుషీ’ మూవీ 20 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతున్న సంధర్భంగా ‘NTV’, దర్శకుడు ‘ఎస్.జే. సూర్య’ని స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎస్.జే. సూర్య మాట్లాడుతూ… “వాలి సినిమా హిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ ఏ.ఎమ్. రత్నం, నేను హైదరాబాద్ వచ్చాము’ ఆ సమయంలో రత్నం గారు, పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారు. అప్పటికే నేను బద్రీ, తమ్ముడు సినిమాలని చూసాను. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ ని మొదటిసారి చూసినప్పుడు, అతను చిన్నపిల్లాడిలాగా ఒక టేబుల్ పైన కార్ బొమ్మ పెట్టి దానితో ఆడుకుంటూ ఉన్నాడు. అది చూసి ఆశ్చర్యపోయాను, హిట్స్ కొట్టిన తర్వాత కూడా ఇంత నార్మల్ గా ఎలా ఉన్నారు అనిపించింది. అప్పటికి తమిళ ఖుషీ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు, పవన్ కళ్యాణ్ ని ఖుషీ కథ చెప్పను, ఆయనకి నచ్చింది. ఖుషీ తర్వాత మళ్లీ ఆ రేంజులో ఇంకో సినిమా చెయ్యలేదు అనే బాధ ఉంది” అంటూ ఎస్.జే. సూర్య మాట్లాడాడు.
ఎస్.జే. సూర్య, పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో ‘పులి’ అనే సినిమా వచ్చింది కానీ ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ ని రాబట్టడంలో ఫెయిల్ అయ్యింది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్, ఎస్.జే. సూర్యల కాంబినేషన్ లో ఇంకో సినిమా రాలేదు. ప్రస్తుతం ఎస్.జే. సూర్య యాక్టర్ గా బిజీ అయ్యాడు, పవన్ కళ్యాణ్ సినిమాలని రాజకియాలని బాలన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఫ్యూచర్ లో ఈ ఇద్దరి కాంబినేషన్ మళ్లీ వర్కౌట్ అవుతుందేమో చూడాలి. పవన్ కళ్యాణ్ తో పాటు మహేశ్ బాబుతో కూడా ‘నాని’ అనే సినిమా చేసిన ఎస్.జే. సూర్య, ‘మహర్షీ’ మూవీని బ్యాక్ టు బ్యాక్ నాలుగు సార్లు చూశానని చెప్పాడు. పవన్ కళ్యాణ్, మహేశ్ బాబుతో మంచి రిలేషన్స్ ఇప్పటికీ మైంటైన్ చేస్తున్న ఎస్.జే. సూర్య చెప్పిన మరిన్ని ఇంటరెస్టింగ్ విషయాలని… కింద లింక్ లో చూడండి.