Project K: ప్రభాస్ ఎంట్రీ సీన్.. ప్రాణం పెట్టి తీస్తున్నామన్న డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న విషయం విదితమే. అందులో ఒకటి ప్రాజెక్ట్ కె. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని శరవేగంగా శూరింగ్ జరుపుకొంటుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోనె నటిస్తుండగా .. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించిన అప్డేట్ ను ఎప్పుడెప్పుడు ఇస్తారా అంటూ అభిమానులు నాగ్ అశ్విన్ ను ట్విట్టర్ వేదికగా అడుగుతూనే ఉన్నారు.
ఇక తాజాగా ఈ డైరెక్టర్ ఒక కీలక అప్డేట్ ను అభిమానులకు తెలిపాడు. “ఇటీవలే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశాం. ప్రభాస్ ఇంట్రో సన్నివేశాలను చిత్రీకరించాం. సినిమా లో ఆయన లుక్ చాలా కూల్ గా ఉంటుంది. జూన్ నుండి తదుపరి షెడ్యూల్ ను మొదలు పెట్టబోతున్నాం. సినిమా కోసం అందరం ప్రాణం పెట్టి పని చేస్తున్నాం”అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ పరాజయంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశకు గురైన విషయం విదితమే. దీంతో ఇప్పడూ వారి ఆశలన్నీ ప్రాజెక్ట్ కె, సలార్ మూవీస్ పైనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇంట్రో అదిరిపోయింది అని డైరెక్టర్ చెప్పడంతో ఇక హైప్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందా ..?అని ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ ఆ గుడ్ న్యూస్ ను ఎప్పుడు అభిమానులకు చెప్తారో చూడాలి.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
Gurtunnaru 🙂 ippude oka schedule ayindi… including prabhas gari intro bit…he looks v cool…june end nunchi malli start…release order lo manam last kada…Inka frequent updates ivvadaniki time undi…but rest assured..andaru pranam petti panichestunnam #Projectk
— Nag Ashwin (@nagashwin7) May 17, 2022
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!