Macherla Niyojakavargam : నితిన్ సినిమా ఈవెంట్ లో దర్శకుడు మిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director missing in Nitin’s movie event!
చేసిన తప్పులు ఎప్పటికైనా వెంటాడతాయనేది అందరూ చెబుతుండే మాట. అది ‘మాచర్ల నియోజకవర్గం’ దర్శకుడి విషయంలో నిజమైంది. టాలీవుడ్ లో ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్‌గా పేరున్న నితిన్ తాజా సినిమా దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్‌ను కీర్తిస్తూ చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ కావడంతో కుల రాజకీయాల వలయంలో చిక్కుకున్నాడు. అయితే ఆ ట్వీట్లు తనవి కావని తన ఎకౌంట్ హ్యాక్ అయిందని కంప్లైంట్ చేశాడు కూడా. అయినా హీరో నితిన్ పై ఆ ట్వీట్స్ తాలూకు వత్తిడి ఉంది. అందుకే గుంటూరులో జరిగిన ‘మాచర్ల నిజయోకవర్గం’ ఈవెంట్ కి దర్శకుడిని దూరంగా పెట్టడమే కాదు కనీసం అతగాడి పేరు కూడా ఉచ్ఛరించలేదు.
‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం గుంటూరులో జరిగింది. అంతేకాదు ఈ వేడుకలో సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడిన హీరో నితిన్ అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడిని పొగిడేశాడు. అంతే కాదు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, హీరోయిన్లు కృతి, కేథరిన్, సంగీత దర్శకుడు సాగర్‌ను కూడా ప్రశంసించాడు. అయితే తన సినిమా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గురించి ఒక్క లైన్ కూడా మాట్లాడలేదు. నిజానికి నితిన్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఆయనతో పాటు టీడీపీ వర్గాలను దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ‘మాచర్ల నియోజకవర్గం’ ఈవెంట్ నుంచి దర్శకుడి తప్పించినట్లు కనిపిస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని సన్నిహితులు ఎంత నొక్కి చెబుతున్నా… అసలు విషయం మాత్రం ఇదే అంటున్నారు. మరి ఈవెంట్ లో కనిపించకుండా పోయిన దర్శకుడు రిలీజ్ కి ముందు మీడియా ఇంటర్వ్యూలలోనైనా మాట్లాడతాడేమో చూడాలి.
Also Read
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్‌కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
- Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
తాజావార్తలు
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!