Maruthi : డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోతో మారుతి చేస్తున్న ది రాజాసాబ్ పై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మారుతి తాజాగా బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ డైరెక్టర్ చెప్పుతో కొట్టుకోవడం చూశాను. డైరెక్టర్లు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. డైరెక్టర్ అంటేనే క్రియేటివ్ గా ఆలోచించాలి. పది మందితో కరెక్ట్ గా పనిచేయించుకోవాలి. అంతేగానీ ఇలా చేస్తే ఇతరులకు నమ్మకం ఎలా ఉంటుంది.
Read Also : The Rajasaab : ది రాజాసాబ్ బడ్జెట్ చెప్పిన మారుతి.. వామ్మో అన్ని కోట్లా..
ఈ రోజుల్లో సినిమాల్లో బూతులు ఉంటేనే చూస్తున్నారు. నేను కూడా పెన్ పట్టుకుంటే అలాంటి బూతు డైలాగులు ఎన్నో రాయగలను. బస్టాప్ సినిమాలో ఇలాంటివి ఎన్నో రాశాను. కానీ ప్రేక్షకులకు కావాల్సింది అవి కావు. మంచి క్వాలిటీతో ఉండే మూవీ వాళ్లకు ఇవ్వాలి. అందుకే బస్ స్టాప్ సినిమాతోనే అలాంటివి రాయడం ఆపేశాను. ఈ రోజు ప్రభాస్ తో సినిమా చేయగలిగాను అంటే అలాంటి డైలాగులతో సినిమాలు తీయడం ఆపేశాను కాబట్టే సాధ్యం అయింది. ప్రభాస్ కు నా మీద నమ్మకం ఉంది. అందుకే రూ.400 కోట్లతో రాజాసాబ్ తీస్తున్నాను అంటూ తెలిపాడు మారుతి.
Read Also : OG : ఓజీలో కత్తిలాంటి మరో హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే..