ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ అయిపోగానే దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి SSMB 29 ప్రాజెక్ట్‌లో జాయిన్ అవనున్నాడు మహేష్. ప్రస్తుతం జక్కన్న స్క్రిప్టు పనులతో బిజీగా ఉన్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత హాలీవుడ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు రాజమౌళి. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో SSMB 29 ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాతో మహేష్ బాబు హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిపోవడం గ్యారెంటీ. ఇక రాజమౌళి సినిమాతో పీక్స్ వెళ్లిపోయిన తర్వాత… మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేస్తాడు? అనే మాట ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది.
గతంలో ఎస్ఎస్ఎంబీ 30 డైరెక్టర్ లిస్ట్‌లో సుకుమార్, కొరటాల శివ పేర్లు వినిపించాయి కానీ ఇప్పుడు రా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ఈ ప్రాజెక్ట్ దాదాపుగా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. అర్జున్ రెడ్డితో అదరగొట్టిన సందీప్ రెడ్డి… ప్రస్తుతం యానిమల్ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్, అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మహేష్, సందీప్ కాంబో తెరపైకి వచ్చింది. సందీప్ కూడా మహేష్ బాబు కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నాను, సరైన టైం వచ్చినపుడు దానిని పట్టాలెక్కిస్తాం… అంటూ గతంలో చెప్పుకొచ్చాడు కానీ ఈ క్రేజీ కాంబో సెట్ అవడానికి కాస్త టైం పట్టనుంది. లేటెస్ట్ అప్డేట్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారట. ఇక మహేష్ గ్యాంగ్ స్టర్ అంటే ఎలా ఉంటుందో బిజినెస్ మాన్ సినిమాలో శాంపిల్ చూసాం, ఇక సందీప్ రెడ్డి వంగ స్టైల్ ఆఫ్ గ్యాంగ్ స్టర్ అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రా డైరెక్టర్‌తో సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. రాజమౌళి సెంటిమెంట్ ని దాటాలి అంటే సందీప్ లాంటి డిఫరెంట్ డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆడియన్స్ కి కూడా కొత్త మహేష్ బాబు కనిపిస్తాడు.