ప్రముఖ దర్శకుడు దేవాకట్టా సోషల్ మీడియాలో నెటిజన్ తో జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో తాజాగా ఓ నెటిజన్ దేవాకట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ మూవీని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా రిపబ్లిక్ చిత్రంలో. ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్… ఎందుకో గానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మంచి సినిమాలు రావంటారు. వస్తే చూడరు. అదే తమిళో, మళయాళమో అయితే ఎత్తేసేవాళ్ళం!” అంటూ సదరు నెటిజన్ డైరెక్ట్ గా దేవాకట్టాను ట్యాగ్ చేశాడు. ఆయన ట్వీట్ చూసిన దర్శకుడు స్పందిస్తూ “ఇది మూడు రోజుల్లో మింగి ఊసే మిఠాయి కాదు, వేప రసం లాంటి నిజం కాబట్టి మెల మెల్లాగా లోతుగా దిగుతూ ఉంది, దిగుతూనే ఉంటుంది! ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు ధన్యుడ్ని! థాంక్యూ!” అంటూ రిప్లై ఇచ్చాడు.
Read Also : బాలయ్య బాలయ్య.. ఇరగతీసావయ్యా.. ‘అఖండ’పై కళ్యాణ్ రామ్ స్పందన
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్” మూవీ ఈ ఏడాది అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ బ్యానర్లు సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. రాజకీయ వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగంలోని అవినీతిని పరిష్కరించే ఐఏఎస్ అధికారి పంజా అభిరామ్ (తేజ్) కథ ‘రిపబ్లిక్’.
ఇది మూడు రోజుల్లో మింగి ఊసే మిఠాయి కాదు, వేప రసం లాంటి నిజం కాబట్టి మెల మెల్లాగా లోతుగా దిగుతూ ఉంది, దిగుతూనే ఉంటుంది! 🤗ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకున్నందుకు ధన్యుడ్ని! థాంక్యూ! 🙏 https://t.co/XJWLqGE3Fy
— deva katta (@devakatta) December 3, 2021