ప్రముఖ దర్శకుడు దేవాకట్టా సోషల్ మీడియాలో నెటిజన్ తో జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో తాజాగా ఓ నెటిజన్ దేవాకట్టా దర్శకత్వం వహించిన ‘రిపబ్లిక్’ మూవీని చూసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కొల్లేరు చుట్టూ అల్లుకొన్న రాజకీయాలను,కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను చాలా పకడ్బందీగా చూపిస్తాడు దేవాకట్టా రిపబ్లిక్ చిత్రంలో. ముఖ్యంగా పదునైన సంభాషణలు ఎస్సెట్… ఎందుకో గానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మంచి సినిమాలు రావంటారు. వస్తే చూడరు. అదే తమిళో, మళయాళమో అయితే…