Bobby : “ఆయన ఒక కర్మయోగి.. ఒక శిఖరం!”.. పవర్ స్టార్‌పై దర్శకుడు బాబీ ఎమోషనల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ గ్లామర్, రాజకీయ అధికారం.. ఈ రెండూ మనిషిని మార్చేస్తాయని అంటుంటారు. కానీ, ఇవేవీ తన వ్యక్తిత్వాన్ని ఇంచు కూడా మార్చలేవని మరోసారి నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయనను కలిసిన ప్రముఖ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర), తన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బాబీకి పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా నుంచే మంచి అనుబంధం ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న ఒక సామాన్యుడు కానీ నేడు ఆయన ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి. హోదా మారింది, బాధ్యత పెరిగింది.. కానీ ఆయనలోని ఆత్మీయత మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని బాబీ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి వెళ్తున్నప్పుడు తనలో ఒక తెలియని ఉద్వేగం కలిగిందని, తీరా అక్కడకు వెళ్ళాక చిరునవ్వులు చిందిస్తున్న ఒక ‘ఋషి’లా ఆయన కనిపించారని బాబీ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read:Raaka: అల్లు అర్జున్ రాకా’కు అర్ధమేంటో తెలుసా?
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
రాజకీయాల్లోకి రాగానే ఆస్తులు కూడబెట్టుకునే వ్యక్తులను మనం నిత్యం చూస్తుంటాం. కానీ, పవన్ కళ్యాణ్ అందుకు పూర్తి భిన్నమని బాబీ కొనియాడారు. “అన్ని సౌకర్యాలను వదులుకొని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు.” రాజకీయ నాయకుడిగా కంటే ఒక గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ తనపై చూపించిన ప్రేమకు తాను ఫిదా అయిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాబీ ఒక అద్భుతమైన పోలికను తీసుకువచ్చారు. జ్ఞానం కోసం రాజభోగాలను వదిలేసి అడవులకు వెళ్లిన గౌతమ బుద్ధుడి గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ, జనం కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం తన సుఖాలన్నింటినీ త్యాగం చేసి నిరంతరం శ్రమిస్తున్న ఒక ‘కర్మయోగి’ని ఈరోజు ప్రత్యక్షంగా చూశానని బాబీ ప్రశంసల వర్షం కురిపించారు. “జైహింద్.. లవ్ యు ఆల్వేస్ మై పవర్ స్టార్” అంటూ బాబీ ముగించిన తీరు పవన్ కళ్యాణ్ పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాన్ని, అభిమానాన్ని చాటి చెబుతోంది.
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం…
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు…ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు…
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న… pic.twitter.com/pt79dmsRNf— Bobby (@dirbobby) April 8, 2026
తాజావార్తలు
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు