Raaka: అల్లు అర్జున్ రాకా’కు అర్ధమేంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. ఒక స్టార్ హీరో సినిమా అనౌన్స్‌మెంట్ వస్తుందంటే, నెలల ముందే టైటిల్స్ లీక్ అవ్వడం మన దగ్గర కామన్ కానీ బన్నీ – అట్లీ కాంబో విషయంలో మాత్రం చిత్ర బృందం మీడియాకు చుక్కలు చూపించింది. అందరినీ విస్మయానికి గురి చేస్తూ ‘రాకా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. సినిమాకు సంబంధించి చిన్న అప్‌డేట్ ఉన్నా క్షణాల్లో పసిగట్టే మీడియా సైతం ఈసారి బోల్తా పడింది. ‘రాకా’ అనే టైటిల్ వస్తుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. యూనిట్ సభ్యులు పాటించిన గోప్యత ఈ విషయంలో వంద శాతం సక్సెస్ అయ్యిందని చెప్పాలి. లీకులకు తావు లేకుండా, సరైన సమయంలో సరైన బాంబు పేల్చి ఫ్యాన్స్‌కు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
Also Read : dune3 : ఒక్క టికెట్ ధర రూ.90,000.. ఇది కదా క్రేజ్ అంటే!
Also Read
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ఈ టైటిల్ వెనుక ఉన్న అంతరార్థంపై నెట్టింట అప్పుడే విశ్లేషణలు మొదలయ్యాయి. ‘రాక్షసుడు’, ‘రాకాసి’ అనే పదాల మూలాల నుంచే ఈ ‘రాకా’ పుట్టినట్లు తెలుస్తోంది. మనిషిలోని మృగ ప్రవృత్తిని లేదా ఒక విధ్వంసకర శక్తిని సూచించేలా ఈ పేరును డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టే బన్నీ ఫస్ట్ లుక్ కూడా ఊహాతీతంగా ఉంది. ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇందులో హీరో, విలన్ ఇద్దరూ అల్లు అర్జునే! ప్రస్తుతం విడుదలైన లుక్ విలన్ పాత్రకు సంబంధించింది. మనిషికి, మృగానికి మధ్య ఉన్న గీతను చెరిపేస్తూ చాలా రగ్గడ్ గా, భయంకరంగా ఈ లుక్ ఉంది. విలన్ పాత్ర ఇంత ఊర మాస్ గా ఉంటే, హీరో పాత్ర మాత్రం అల్ట్రా స్టైలిష్‌గా ఉండబోతోందని సమాచారం. ఐకాన్ స్టార్ అసలైన స్టైల్ ఆ పాత్రలో కనిపిస్తుందట. ప్రస్తుతానికి ‘రాకా’ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన బన్నీ, ఇక హీరో లుక్ ఎప్పుడు వదులుతారా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ తన 22వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసానికి తెరలేపడం ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!