హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య ధియేటర్లో ఏర్పడిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు. బైలు లభించినా సరే బెయిల్ ఆర్డర్ జైలు అధికారులకు అందకపోవడంతో ఒకరోజు ఆయన జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఆయన నుంచి విడుదలై ముందు గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి అల్లు నివాసానికి వెళ్లారు.
ఇక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి సుకుమార్ తో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లగా విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. మరోపక్క ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొరటాల శివ, వంశీ పైడిపల్లితో కలిసి అల్లుఅర్జున్ నివాసానికి వెళ్లారు. మరోపక్క దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో శ్రీకాంత్ అలాగే దగ్గుబాటి సురేష్ బాబు సైతం అల్లు అర్జున్ ని పరామర్శించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు.