స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగు తమిళ భాషల్లో నిర్మించిన సినిమా ‘వారిసు/వారసుడు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న తమిళనాడులో రిలీజ్ అయిన వారిసు, తెలుగులో మూడు రోజుల డిలేతో జనవరి 14న రిలీజ్ అయ్యింది. మాస్ సినిమాలని చేస్తూ కమర్షియల్ సక్సస్ లు కొడుతున్న విజయ్ ని వంశీ పైడిపల్లి ఫ్యామిలీ సినిమాలో చూపించాడు. ఫ్యామిలీ, ఎమోషన్స్, కామెడీ లాంటి ఎలిమెంట్స్ విజయ్ లో మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసే విజయ్ కాకుండా పాత విజయ్ ని చూపించాలి అనే వంశీ పైడిపల్లి ఆలోచన బాగానే ఉంది, సినిమాకి కూడా మంచి రీవ్యూస్ వచ్చాయి. విడుదలైన వారం రోజుల్లోనే వారిసు మూవీ 210 కోట్లని రాబట్టి కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది.
టిల్ డేట్ వారిసు మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 250 కోట్ల గ్రాస్ ఉంటుంది, ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబడితే ఏ సినిమా అయినా సూపర్ హిట్ కిందే లెక్క కానీ వారిసు మాత్రం ఈ లిస్టులో ఇంకా చేరలేదు. విజయ్ రెమ్యూనరేషన్, సినిమా బడ్జట్, చేసిన బిజినెస్ అన్నీ అంచనా వేసి చూస్తే వారిసు మూవీ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదని సమాచారం. 250 కోట్ల గ్రాస్ రాబట్టినా వారిసు మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. వారిసు సినిమాకి విజయ్ 110 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడనే వార్త కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ఇప్పటివరకూ వారిసు మూవీ కలెక్ట్ చేసింది విజయ్ రెమ్యునరేషన్ అంత మాత్రమే. ఇక మిగిలినవి రాబడితేనే వారిసు మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయినట్లు లేదంటే వారిసు మూవీ బయ్యర్స్ కి నష్టాలు మిగిలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.