Dil Raju: బుట్టబొమ్మ జపం చేస్తున్న బడా నిర్మాత..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం టాలీవుడ్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే పేరు మారుమ్రోగిపోతుంది. స్టార్ హీరోల సరసన అమ్మడు నటిస్తున్న సినిమాల లైన్ పెరిగిపోవడంతో పూజా టాలీవుడ్ లక్కీ చార్మ్ అంటూ పొగిడేస్తున్నారు. ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో పరాజయాన్ని చవిచూసిన పూజా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన బీస్ట్ లో నటిస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెల్సిందే. ఇకపోతే గత కొన్నిరోజుల నుంచి ఈ బడా నిర్మాత బుట్టబొమ్మ జపం చేస్తున్నాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. పూజా టాలీవుడ్ లక్కీ చార్మ్ అని.. ఆమె ఉంటే సినిమా హిట్ అని బీస్ట్ వేడుకలో అమ్మడిని ఆకాశానికి ఎత్తేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా బీస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు.. పూజా గురించి మరోమారు పొగడ్తల వర్షం కురిపించాడు. ‘పూజా హెగ్డే లక్కీ గర్ల్‌గా మారింది, టాలీవుడ్ టాప్ హీరోలందరితోనూ నటించి బ్లాక్ బస్టర్ హిట్స్‌ని అందుకుంటుంది. ఇప్పుడు బీస్ట్ కూడా హిట్ ని అందుకుంటుందని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే విజయ్- వంశీ పైడిపల్లి సినిమాలో కూడా మొదట పూజానే తీసుకుందామని అనుకున్నాం.. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాలేదు.. అంతేకాకుండా బీస్ట్ వెంటనే మళ్లీ విజయ్ తో కాంబో రిపీట్ అవ్వడం ఎందుకు అని పూజా ప్లేస్ లో రష్మికను తీసుకున్నాం@ అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో సోషల్ మీడియా లో మరోసారి పూజా- త్రివిక్రమ్ ల చర్చ మొదలయ్యింది. మొన్నటివరకు త్రివిక్రమ్ ఒక్కడే పూజా జపం చేస్తున్నాడని అనుకున్నారు.. ఇక ఇప్పుడు తాజాగా బడా నిర్మాత కూడా పూజా జపం చేస్తున్నారు. వీరి మధ్యలో ఏం జరుగుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ లక్కీ చార్మ్ ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!