Dilraju : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూసి మిగతా హీరోలు నేర్చుకుంటే నిర్మాతలకు లాభం జరుగుతుందన్నారు. ఈ నడుమ హీరోల గురించి దిల్ రాజు చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్కింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అవుతుందో ముందే తెలుసుకుని ఇన్ని రోజులు ఇస్తానని చెప్పేస్తారు. ఆయన చెప్పినన్ని రోజులు కచ్చితంగా వస్తారు. అలాంటప్పుడు డైరెక్టర్లు, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నెలకు 20 రోజుల చొప్పున ఆయన డేట్లు ముందే చెప్పేస్తారు.
Read Also : Samantha: ఏంటి సమంత.. అలా స్టేజిపై ఏడ్చేశావ్.. అభిమానులు ఏమై పోవాలి..!
తన కాల్షీట్ల గురించి ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల నిర్మాతలకు ఖర్చు భారీగా తగ్గుతుంది. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం తీసుకుని షూటింగ్ ను ఫాస్ట్ ఫినిష్ చేసేయొచ్చు. ఆయన నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్నారు. విజయ్ లాగా మిగతా హీరోలు కూడా వర్కింగ్ స్టైల్ ను మార్చుకుంటే నిర్మాతలకు ఎంతో లాభం జరుగుతుంది అంటూ చెప్పారు దిల్ రాజు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ చర్చకు దారి తీశాయి. ఇంతకీ ఏ హీరో దిల్ రాజును ఇబ్బంది పెట్టారా అంటూ మళ్లీ ప్రచారం మొదలైంది. మొన్న చరణ్ మీద శిరీష్ చేసిన కామెంట్లు పెద్ద రచ్చకు దారి తీశాయి. ఇప్పుడు మరోసారి దిల్ రాజు హీరోల గురించి ఇలాంటి కామెంట్లే చేస్తున్నారు.
