Dilraju : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతిపై దిల్ రాజు ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూసి మిగతా హీరోలు నేర్చుకుంటే నిర్మాతలకు లాభం జరుగుతుందన్నారు. ఈ నడుమ హీరోల గురించి దిల్ రాజు చేస్తున్న కామెంట్లు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాట్లాడుతూ.. విజయ్ వర్కింగ్ స్టైల్ వేరేలా ఉంటుంది. ఆయన ముక్కుసూటిగా ఉంటారు. సినిమా షూటింగ్ ఎన్ని రోజులు అవుతుందో ముందే తెలుసుకుని ఇన్ని రోజులు ఇస్తానని చెప్పేస్తారు.…