టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కాబోతున్నాడా..? నేటి అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా , డిస్ట్రిబ్యూటర్ గా రాజుకు ఉన్న పేరు మామూలుది కాదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన దిల్ రాజు మొదటి భార్య శిరీష 2017లో అనారోగ్యంతో అకాల మరణం చెందటం తెలిసిందే. దీంతో రెండేళ్లు రాజు కుంగిపోయాడు. తండ్రిని అలా చూడలేని కూతురు హన్షిత రెడ్డి.. మరోసారి తండ్రి దిల్ రాజుకు రెండో వివాహం జరిపించింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో బంధువుల సమక్షంలో దిల్ రాజు, వైఘా రెడ్డి(తేజస్విని) మెడలో మూడు ముళ్ళు వేశాడు. 51 ఏళ్ల వయస్సులో రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు.. తాజాగా తండ్రి కాబోతున్నాడట. తేజస్విని ప్రస్తుతం నిండు గర్భిణీ అని, త్వరలోనే ఈ దంపతులు ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, నిజమే అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇక ఇప్పటికే హన్షిత రెడ్డి కి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాత అయ్యాకా దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నాడు అన్నమాట. అయితే ఈ విషయం తెలియడంతో నెటిజన్లు దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.