Mahesh Babu: పుష్ప.. అల్లు అర్జున్.. సుకుమార్.. నేషనల్ అవార్డ్స్.. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. 69 వ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక అందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇక దీంతో అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మరికొందరు ఈ సినిమా ను వదిలేసుకున్న హీరో గురించి మాట్లాడుతున్నారు. అవును .. పుష్ప కథను .. సుకుమార్ ముందుగా మహేష్ బాబుకు చెప్పాడు. మహేష్ ఈ కథను వద్దని చెప్పడంతో.. పుష్ప.. అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. ఈ విషయాన్నీ మహేష్ ట్విట్టర్ వేదికగా అప్పుడే అభిమానులకు తెలిపాడు. కొన్ని కారణాల వలన సుకుమార్ తో తన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, మంచి కథ దొరికితే తామిద్దరం చేయడానికి రెడీ గా ఉన్నామని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి కాంబో లో వన్ నేనొక్కడినే సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఇకపోతే మహేష్.. ఈ కథను వద్దనడానికి కూడా రీజన్ ఉంది.
Sharwanand: బ్రేకింగ్.. శర్వానంద్ కు సర్జరీ.. ?
మొదటి నుంచి కూడా మహేష్ తన బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే సినిమాలనే ఎంచుకుంటాడు. పుష్పలో ఉన్న డెప్త్ ను తాను క్యారీ చేయలేనని.. అందుకే ఆ సినిమా చేయలేనని సుకుమార్ తో చెప్పాడట. నిజం చెప్పాలంటే.. అల్లు అర్జున్ పుష్ప చూశాక .. ఆ పాత్రలో అతను తప్ప మరొక హీరోను ఉహించుకోలేం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు నేషనల్ అవార్డు వరించింది కాబట్టి పుష్పను వదిలేసి మహేష్ తప్పు చేశాడా.. ? అంటున్నారు. కానీ, మహేష్ అలాంటి పాత్రలకు సెట్ అవ్వడని ఆయనకే తెలుసు కాబట్టి.. ఆ నిర్ణయం తీసుకున్నాడని బన్నీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. ఎవరికి రాసి పెట్టి ఉన్న సినిమా వారికే చెందుతుంది. ఇక పుష్ప అంటే బన్నీనే.. ఇక డిస్కషన్స్ అవసరమే లేదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.