తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్ ఇంకోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తాడా అని మెగా అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా అనౌన్స్ అయ్యింది. ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంతకు మించి అనే రేంజులో ‘భవదీయుడు భగత్ సింగ్’ పోస్టర్ తో సహా అనౌన్స్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అంతా ఖుషీ అయ్యారు.
పవన్ అభిమానులకి షాక్ ఇస్తూ హరీష్ శంకర్ ‘తెరి’ సినిమాని రీమేక్ చేస్తున్నాడు అనే రూమర్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ అప్సెట్ అయ్యి, #WedontwantTheriRemake అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. కొత్త కథతో సినిమా చెయ్యకుండ ఇంకెన్ని రోజులు పవన్ కళ్యాణ్ తో రిమేక్స్ మాత్రమే చేస్తారు? మా హీరోని సరిగ్గా వాడుకోవట్లేదు అంటూ పవన్ ఫాన్స్ ట్విట్టర్ లో హల్చల్ చేశారు. పవన్ అభిమానుల ఆవేశాన్ని మరింత పెంచుతూ హరీష్ శంకర్, ఫాన్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. ఒక సినిమాని రీమేక్ చేయకండి అంటూ మూడు లక్షల ట్వీట్స్ పోల్ అయ్యాయి అంటే పవన్ ఫాన్స్ చేసిన రచ్చ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ రచ్చ జరుగుతుండగానే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ సినిమా పూజా కార్యక్రమాలని పూర్తి చేసేసాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని మార్చాడు. టైటిల్ ని మార్చిన హరీష్ శంకర్, ఈ సినిమా ఓపెనింగ్ సంధర్భంగా తనకి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ చెప్తూ ట్వీట్ చేశాడు.
” నన్ను ఇన్స్పైర్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ… నన్ను ఛాలెంజ్ చేసి, ది బెస్ట్ ఇవ్వడానికి ప్రేరేపించిన మిగిలిన విషయాలని డబుల్ థ్యాంక్స్” అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. హరీష్ శంకర్ ది ట్వీటా లేక కౌంటరా అనే డిస్కషన్ పవన్ ఫాన్స్ లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో తెలిసిన హరీష్ శంకర్, మరోసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ఫ్యాన్ స్టఫ్ ఇస్తాడని చాలా మంది కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ని హరీష్ శంకర్ ఎంత వరకూ నిలబెట్టుకుంటాడు అనేది చూడాలి. ఇదిలా ఉంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ‘తెరి’కి రీమేక్ వెర్షనా కాదా అనే విషయంలో ఇప్పటికీ ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేకపోవడం విశేషం.
Thank you for all the love which inspires me to do more , and double thanks to all the other concerns which challenges me to give my best ; pic.twitter.com/3HvPz6EkgZ
— Harish Shankar .S (@harish2you) December 12, 2022