Dhruva Natchathiram : ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అయిన చియాన్ విక్రమ్ సినిమా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా మొదలైన పూర్తి యాక్షన్ థ్రిల్లర్ సినిమా ధృవ నక్షత్రం. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకేక్కించేందుకు ప్లాన్ చేసారు మేకర్స్. కానీ వరుస వాయిదాల కారణంగా ఈ సినిమాను పక్కన పెట్టేసారు..ఆరేళ్లుగా అలా మూలన పడి ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫైనల్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఎన్నై అరిందాల్ మరియు రాఘవన్ లాంటి యాక్షన్ థ్రిల్లర్‌లతో ఆ సమయంలో దర్శకుడు గౌతమ్ మీనన్ మంచి ఫామ్ లో వున్నారు.ఆ సమయంలో చియాన్ విక్రమ్ కు ఒక స్టోరీ నీ చెప్పి బాగా ఇంప్రెస్స్ చేసాడు గౌతమ్ మీనన్. అలా స్టార్ట్ చేసిన స్పై థ్రిల్లర్ మూవీ ధృవ నక్షత్రం. హీరోగా విక్రమ్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే మొదలైన ఈ సినిమా బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది. 2015లోనే ప్రీ ప్రొడక్షన్ మొదలైన కూడా 2017 వరకు సెట్స్ పై కి వెళ్ళలేదు.. షూటింగ్ స్టార్ట్ అయిన తరువాత కూడా ఈ సినిమా వరుస ఆర్థిక ఇబ్బందులతో వాయిదా పడుతూ వచ్చింది..విక్రమ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమాను అమెరికాతో పాటు బల్గేరియా, అబుదాబి, జార్జియా, టర్కీ మరియు ఇస్తాంబుల్ లాంటి దేశాల్లో చిత్రీకరించారు.
2019 లోనే షూటింగ్ అంతా కూడా పూర్తయ్యింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయిందని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. కానీ ఆ తరువాత గౌతమ్ మీనన్ ఆర్థిక ఇబ్బందులలో ఉండటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.అయితే ఎట్టకేలకు ధృవ నక్షత్రం రిలీజ్ కు సిద్ధం అవుతుంది.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. దాదాపు ఆరేళ్ల షూటింగ్ తరువాత ధృవ నక్షత్రం సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో విడుదల విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకుంది చిత్రయూనిట్. త్వరలోనే విడుదల తేదీనీ అధికారికంగా ప్రకటించ బోతున్నారు..అలాగే ఈ సినిమా ప్రమోషన్న్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.. ప్రజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద స్పై సినిమాల ట్రెండ్ నడుస్తుంది. దీనితో ధృవ నక్షత్రంకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి చాలా ఏళ్ల తరువాత కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!