Dheera Movie Making Video: టాలీవుడ్ లక్ష్ చదలవాడ ప్రస్తుతం ‘ధీర’ అనే మంచి కమర్షియల్ సబ్జెక్టుతో రాబోతున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి అందరినీ ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ ధీర గ్లింప్స్, టీజర్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ మూవీ జానర్ ఏంటి? ఎలా ఉండబోతోంది? అని హింట్ ఇచ్చాడు మేకర్లు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మేకింగ్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
Kancharla: యువత రాజకీయాల్లోకి వచ్చే స్ఫూర్తి కలిగించేలా ‘కంచర్ల’
షూటింగ్ స్పాట్‌లో యూనిట్ ఎంత సరదాగా ఉందో ఎంత కష్టపడి చిత్రీకరణ చేశారో చూపించేలా వదిలిన ఈ మేకింగ్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ధీర మూవీ షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. లక్ష్ చదలవాడ నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. కన్నా పీసీ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి రచన – దర్శకత్వం విక్రాంత్ శ్రీనివాస్ అందిస్తున్నారు.