Animal : యానిమల్ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం కానుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న రిలీజ్ అయి బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ మూవీ సుమారు రూ.900కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ హిట్ అయింది. ఈ మూవీ పై మొదట్లో విమర్శలు వచ్చినా కూడా కమర్షియల్‍గా మాత్రం భారీ విజయం సాధించింది. ఇక.. యానిమల్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కోర్టులో కేసు నడుస్తుండడం ఇందుకు కారణంగా ఉంది. యానిమల్ సినిమాను నిర్మించిన టీ-సిరీస్, ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్‍పై ఈ మూవీకి సహ నిర్మాతగా ఉన్న సినీ వన్ స్టూడియోస్ కోర్టులో కేసు వేసింది. తమకు టీ-సిరీస్ బకాయిలను చెల్లించలేదని, అందుకే యానిమల్ ఓటీటీ రిలీజ్‍ను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్‍ను విచారించిన న్యాయస్థానం నేడు టీ-సిరీస్‍తో పాటు నెట్‍ఫ్లిక్స్‌కు నోటీసులు జారీ చేసింది.నోటీసులు అందడంతో టీ-సిరీస్ మరియు నెట్‍ఫ్లిక్స్ కోర్టుకు అఫిడవిట్స్ సమర్పించాల్సి ఉంది. తదుపరి విచారణను జనవరి 22వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.యానిమల్ మూవీ లాభాల్లో తమకు ఒక్క రూపాయి కూడా టీ-సిరీస్ చెల్లించలేదని సినీ వన్ స్టూడియోస్ కోర్టుకు తెలిపింది. రూ.2.6 కోట్లు ఇచ్చినట్టు టీ-సిరీస్ తరఫున న్యాయవాది తెలిపినా.. అందుకు తగిన ఆధారాలను అయితే చూపలేదు.యానిమల్ సినిమాను జనవరి 26వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురావాలని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ భావించింది.కానీ ఇప్పుడు ఈ విషయం కోర్టు విచారణపై ఆధారపడి ఉంది. జనవరి 22వ తేదీన ఈ కేసు ఓ కొలిక్కి రాకపోతే యానిమల్ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం వున్నట్లు సమాచారం.ఒకవేళ ఈ కోర్ట్ కేసు క్లియర్ అయితే యానిమల్ మూవీ అనుకున్న సమయానికి ఓటీటీ రిలీజ్ కానుంది.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!