బాలీవుడ్‌లో ‘రాన్‌జానా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్‌తో హీరో ధనుష్ మరోసారి చేతులు కలిపారు. ఈ జంట కొత్త సినిమా ‘తేరే ఇష్క్ మే’ పేరుతో నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తమిళ భాషలో కూడా ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ధనుష్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.
Also Read : Akkineni Nagarjuna : నాగార్జున ఇమేజ్‌కు లీగల్ ప్రొటెక్షన్.. 72 గంటల్లో లింక్స్ తొలగించాలని ఆదేశం
కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌లో ధనుష్ పాత్రలోని భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రేమలో మోసపోయిన వ్యక్తి ఆవేదనను ఆయన శైలిలో చూపించగా.. ‘నా తండ్రి అంత్యక్రియలకు బనారస్ వెళ్లాను.. నీ కొత్త జీవితం కోసం పవిత్ర గంగాజలం తెచ్చాను. కనీసం నీ పాత పాపాలు కడుక్కో” అని కృతితో చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ కథ రాసిన ఈ సినిమాను ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.