Devara Team Planning a Interview of NTR With Suma: దేవర బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో చెలరేగుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత రిలీజ్ కావడం, పోటీలో సినిమాలు ఏవి లేకపోవడం, గ్రౌండ్ ఖాళీగా ఉండటంతో దేవరకు మొదటి రోజు రూ. 172 భారీ ఓపెనింగ్స్ వచ్చింది. మొదటి మూడు రోజులు దూసుకెళ్లిన దేవర సోమవారం కాస్త తగ్గినా మంగళవారం మళ్ళి పుంజుకుంది, అయితే తరువాత గాంధీ జయంతి హాలిడే కావడంతో మేజర్ సిటీస్ లో హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. కానీ బుధవారం నాడు కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది.
Actress Vardhini: నటి శాడిజం.. ప్రియుడు ఆత్మహత్య!!
ఇక ఇప్పటికే చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టనుంది దేవర. ఇదిలా ఉండగా సినిమాకు హిట్ టాక్ వచ్చినా వదిలేది లేదు అంటోంది సినిమా యూనిట్. అదేమిటి అనుకుంటున్నారా? అవును సినిమా హిట్ టాక్ వచ్చాక కూడా ప్రమోషన్స్ వదలడం లేదు టీం. వచ్చేది దసరా సీజన్ కావడం, పెద్దగా పోటీ సినిమాలు ఏవీ రిలీజ్ కి లేకపోవడంతో సినిమా చూడకుండా మిగిలిన అన్ని ఫ్యామిలీస్ ను థియేటర్లకు రప్పించేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు ఎన్టీఆర్ తో సుమ ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈరోజు షూట్ జరుగుతుండగా త్వరలో రిలీజ్ చేయనున్నారు.