Detective Teekshana Trailer: కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగువారికి కూడా సుపరిచితమే. కానీ, ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర గురించి మాత్రం తెలుగువారికి తెలియదు. కానీ, ఆమె కూడా కన్నడలో స్టార్ హీరోయిన్. పెళ్లి తరువాత కూడా ప్రియాంక సినిమాలు కొనసాగిస్తుంది. ఇక ప్రియాంక నటించిన 50 వ సినిమా డిటెక్టివ్ తీక్షణ. త్రివిక్రమ్ రఘు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈవెంట్ లింక్క్స్ ఎంటర్‌టైన్‌మెంట్ & SDC సినీ క్రియేషన్స్ బ్యానర్ పై గుత్తా ముని ప్రసన్న, ముని వెంకట్ చరణ్ మరియు పురుషోత్తం బి కొయ్యూరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో డిటెక్టివ్ తీక్షణగా ప్రియాంక ఉపేంద్ర కనిపించింది.
ట్రైలర్ ను మొత్తం యాక్షన్ తో నింపేశారు. ఒక సాల్వ్ చేయలేని కేసు కోసం డిటెక్టివ్ తీక్షణను ప్రభుత్వం రంగంలోకి దింపుతారు. ఒక మాఫియా గ్యాంగ్ .. వారిని ఎదిరించిన ఒక వ్యక్తిని చంపేస్తుంది. వారిపై అతని భార్య కేసు పెట్టినా కూడా కోర్ట్ లో తీర్పు ఆమెకు అనుకూలంగా రాకపోయేసరికి ఆమె కోర్టు ముందే సూసైడ్ చేసుకుంటుంది. ఇక ఆమెకు న్యాయం చేయడానికి తీక్షణ ఏం చేసింది.. ? అసలు ఆ మాఫియా ను తీక్షణ ఎలా అంతం చేసింది.. ? అస్సలు ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటి.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ప్రియాంక.. డిటెక్టివ్ గా తన విశ్వరూపం చూపించిందనే చెప్పాలి. ట్రైలర్ తోనే సినిమాపై హైప్ తీసుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ప్రియాంక ఉపేంద్ర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.