Anand deavrakonda: అర్జున్ రెడ్డి తమ్ముడివి అయ్యి ఉండి .. లిప్ లాక్ కు అన్ని టేకులు తీసుకుంటే ఎలా బ్రో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand deavrakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా నుంచి ఈ మధ్య వచ్చిన ఖుషీ సినిమా వరకు విజయ్ చేసే సినిమాలు.. అందులో లిప్ లాక్స్ కామన్ గా ఉంటున్న విషయం తెల్సిందే. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ రొమాన్స్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే. ఇక అన్నను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. విజయ్ తమ్ముడిగా కాకుండా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటూ వస్తున్నాడు. ఇక అందులో భాగంగానే బేబీ సినిమా ఒప్పుకొని మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండపై అభిమానులు మంచి అంచనాలనే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం గం గం గణేశా. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ నటిస్తోంది. హై లైఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి మరియు వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ ను నేడు మేకర్స్ రిలీజ్ చేశారు.
Jayalalitha: వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే ఆమెకు.. మహేష్ సినిమాలో అలాంటి పాత్రా అన్నారు
Also Read
ఇక ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ఇమ్మాన్యుయేల్ .. ఆనంద్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ” ఆనంద్ దేవరకొండ అన్నతో చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు మొదట.. ఆనంద్ అన్న ఉన్న ప్రతి సీన్ లో నేను కూడా ఉంటాను అని చెప్పారు. అయితే.. ఒకరోజు నాకు సీన్ లేదు అన్నారు. నాకు లేదు అంటే ఆనంద్ అన్నకు కూడా ఉండదు అనుకున్నాను. అయితే అక్కడకు వెళ్లి చూస్తే .. ఆనంద్ అన్న లిప్ లాక్ సీన్ చేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు 20 టేకులు తీసుకున్నాడు. టీజర్ లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది. టేక్స్ తీసుకున్న ప్రతిసారి ఏ ఇదంతా నా వల్ల కావడం లేదు.. అని ఆనంద్ అన్న చెప్పేవాడు. ఎలాగోలా 20 టేకుల తరువాత ఆ లిప్ లాక్ సీన్ ఓకే అయ్యింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అర్జున్ రెడ్డి తమ్ముడివి అయ్యి ఉండి .. లిప్ లాక్ కు అన్ని టేకులు తీసుకుంటే ఎలా బ్రో..? అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!