యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దేవర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగ ఇప్పుడు దేవర జపాన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపధ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ లో దేవర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
Japan Devara
RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. జపాన్ లో దేవర భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ కు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారి కోసమే స్వయంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లి మరి దేవరను ప్రమోట్ చేస్తున్నాడు.
Jr Ntr
జపాన్ లో ఎన్టీఆర్ సినిమాలకు ఫ్యాన్స్ భారీ స్థాయిలో ఉన్నారు. ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలోని గోల గోల రంగోల పాట జపాన్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. సింహాద్రి, బాద్ షా, RRR వంటి సినిమాలు జపాన్ లో సూపర్ హిట్స్ గా నిలిచాయి.
Ntr Japan
జపాన్ లోని టోక్యో స్ట్రీట్ లో కోక్ తాగుతున్న ఫొటోస్ దేవర టీమ్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి. జపాన్ వీధుల్లో టైగర్ చిల్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Devara Tokyo