అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప.. ఈ శుక్రవారం రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా దూసుకెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇకపోతే ‘పుష్ప’ లో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ విమర్శలు గుప్పుమంటున్నాయి. బన్నీ, రష్మిక మధ్య వచ్చే కొన్ని సీన్స్ మరీ ఎబెట్టుగా ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియెన్స్ కి అవి ఇబ్బందికరంగా ఉన్నాయని సినీ విమర్శకులు తేల్చి చెప్పారు.
ఇక దీంతో మేకర్స్ ఆ సీన్స్ ని డిలీట్ చేశారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే… పుష్ప – శ్రీవల్లి రొమాంటిక్ సీన్.. వ్యాన్ లో కూర్చొన్న పుష్ప.. శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు.అలా మాట్లాడుతూ పుష్ప చేయి శ్రీవల్లి యెడ భాగంపైకి వెళ్తోంది.. అది కొంచెం అతిగా ఉందని ఒక వర్గం ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారని విమర్శకులు తెలుపుతున్నారు. దీంతో చిత్ర బృందం ఆ సీన్ ని డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి ఈ సీన్ మూవీలో కనిపించదట.. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర కావడానికి ఇలాంటి సీన్స్ ని డిలీట్ చేయడమే బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.